అదేమిటో తెలియదు కానీ, ప్రజాప్రతినిధులు, నాయకులు విలేఖరులను చూస్తే భయపడి చస్తున్నారు. ఏమైందని ఎవర్ని ప్రశ్నించినా ఒకటే సమాధానం! ఏజెన్సీ సరిహద్దు గ్రామాలపై ఏనుగుల గుంపు దాడి జరిపినట్టు తమపై విలేఖరుల దండు వచ్చిపడుతోందంటూ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా విలేఖరుల దండుడు కార్యక్రమాలు పెచ్చుమీరిపోయాయి.ఈ మద్య మీటీంగులు మీద మీటీంగులు పెడుతున్నారు. భోజనాలు, గిప్టుల కోసమని వేలకు వేలు ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి దండుతున్నారు.