న్యూఢిల్లీ: ఆర్థిక యాజమాన్య నిర్వహణలో చూపిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా విశాఖజిల్లా చోడవరం సహకార చక్కెర కర్మాగారానికి జాతీయస్థాయిలో రెండో బహుమతి లభించింది. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జాతీయ సహకార చక్కెర కర్మాగారాల సమాఖ్య ఈ అవార్డును అందించింది. కేంద్ర మంత్రి శరద్‌పవార్, భారీపరిశ్రమల శాఖా మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ల నుంచి రాష్ట్ర చెరకు, చక్కెరశాఖ కమిషనర్ కె.లక్ష్మినారాయణ, చోడవరం చక్కెర కర్మాగారం మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.రామయ్యలు ఈ 'ఫైనాన్షియల్ మేనేజమెంట్ అవార్డు' అందుకున్నారు.