Loading...
విశాఖపట్నం: అంతర్జాతీయ జ్యోతిష్య సదస్సుకు నగరం వేదిక కానుంది. అక్టోబరు 1 నుంచి నాలుగురోజులపాటు దేశ విదేశాలకు చెందిన జ్యోతిష్య శాస్త్రజ్ఞులతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ అతిథి గృహంలో సదస్సులు జరుగుతాయని సమన్వయకర్త వై.సుదర్శనరావు తెలిపారు. బుధవారం ఉదయం టైకూన్ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సద్గురు శివానందమూర్తి సారథ్యంలో కళాభారతి ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రోశయ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఆరుగురు విదేశీ జ్యోతిష్యశాస్త్ర పండితులు, 19మంది స్వదేశీ పండితులు సదస్సులకు హాజరవుతారన్నారు. 'వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు 2012 యుగాంతానికి నాందిగా భావించవచ్చా? నక్షత్ర, గ్రహ మండలాల్లో మార్పులు నిజమేనా? తదితర అంశాలపై చర్చిస్తారు. భవిష్యత్తు అంశాలపై రూపొందించిన పుస్తకాలను విడుదల చేస్తారు. విలేకర్ల సమావేశంలో జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు జేమ్స్ కెల్హర్(అమెరికా), ఆర్.రాఘవేంద్రన్, వై.సుదర్శనరావు, ఎన్.రాధాకుమారి, కె.బసవరాజు, జి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.