ముంబయి: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముంబయి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. టౌన్‌హాల్‌లో సెయింట్ జేవియర్స్ విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం ఒబామా ఢిల్లీకి పయనమయ్యారు. సాయంత్రం ఒబామా హుమయూన్ సమాధిని సందర్శించనున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తన నివాసంలో ఇచ్చే విందులో ఒబామా దంపతులు పాల్గొననున్నారు.