హైదరాబాద్: భారత రైతు ఉద్యమ పితామహుడు ఆచార్య ఎన్‌జీ రంగా నూట పదకొండవ జయంతిని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ రాజకీయ నేతకంటే రైతు నేతగానే ఎన్‌జీ రంగాకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు. ఏ విషమైనా ఎన్జీ రంగా తొలుత తాను ఆచరించి చూపే ప్రత్యేక లక్షణమున్నవారని ఆయన కొనియాడారు.