** తాజా వార్తలు : 11న కలెక్టరేట్ల ముట్టడి: టీఆర్‌ఎస్‌వీ ** తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు దారుణం: ఎర్రన్నాయుడు, ముఖ్యనగరాల్లో కాంగ్రెస్‌ పార్టీ 125వ వార్షికోత్సవ కార్యక్రమాలు ** బోడోలాండ్‌ తీవ్రవాదుల కాల్పులు: 12 మంది మృతి ** బలహీనపడి... కర్ణాటకకు తరలిన జల్‌ తుపాను ** గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే సూపర్‌పవర్‌ కల నెరవేరదు: జేపీ ** విశాఖపట్నం: ఉద్యోగం రాలేదని మునగపాకకు చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు** విశాఖపట్నం: జిల్లాలో వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.4500 చొప్పున పరిహారం ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టరు శ్యామలరావు చెప్పారు**
Loading...

చంద్రుడిపైకి మరమనిషి...

లండన్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపైకి మరమనిషిని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో వెయ్యి రోజుల్లో ఈ లక్ష్యాన్ని సాధించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడిపై రోబో నడిచే మహత్తర సందర్భం కొత్త తరం శాస్త్రవేత్తలకు ఉత్తేజాన్నిస్తుందని వారు ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ఆసక్తి లేకపోవడంతో శాస్త్రవేత్తలే స్వయంగా పూనుకుని విచక్షణ నిధుల్ని వాడటమే కాకుండా, ఇంజినీరింగ్‌ కంపెనీల సాయాన్ని తీసుకున్నారు. హ్యూస్టన్‌లోని జాన్సన్‌ అంతరిక్ష కేంద్రం ముఖ్య ఇంజినీర్‌ స్టీఫెన్‌ ఆల్టెమస్‌ ప్రత్యేక ఆసక్తితో ఈ ప్రాజెక్టు పట్టాలకెక్కింది. తోటి శాస్త్రవేత్తలను పోగేసి నిధుల కొరత సమస్యను వివరించి, వీలైనంత వేగంగా దీనిని పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు సాగిస్తున్నారు. మామూలుగా మనిషిని పంపించేందుకయ్యే వ్యయంతోనే రోబోను పంపనుంది. చంద్రుడిపైకి మనిషిని పంపడంకన్నా రోబోను పంపడమే తేలికని శాస్త్రబృందం చెబుతోంది. ఎందుకంటే. మరమనిషికి ఆక్సిజన్‌, ఆహారం అందించాల్సిన అవసరం లేదు. తిరుగు ప్రయాణం ఖర్చూ ఉండదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సాయంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు.