న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో మర్రి శశిధర్‌రెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మర్రి శశిధర్‌రెడ్డికి పీసీసీ పీఠం దక్కే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. అయితే కుల, రాజకీయ సమీకరణాలను అనుసరించి దీనిపై అధిష్ఠానం ఈ సాయంత్రానికి ఓ నిర్ణయం తీసుకోనుంది. పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.