ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో టాటా-సికార్‌స్కై హెలీకాప్టర్ల తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి రోశయ్య, టాటా సంస్థ అధినేత రతన్‌టాటాలు ప్రారంభించారు. 70 ఎకరాల్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ఈ తయారీ ప్లాంట్ నిర్మితమైంది. 2015 కల్లా పూర్తిస్థాయి విమానాలు ఇక్కడే తయారుకానున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.