Loading...
జల్' తుపాను తీవ్రత తగ్గే అవకాశం
విశాఖ : ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'జల్' తుపాను తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్ర తుపాను దశ నుంచి ఇది తుపానుగా మారే సూచనలు కన్పిస్తున్నట్లు వెల్లడించారు. మరో రెండు, మూడు గంటల్లో దీని తీవ్రత తగ్గుముఖం పడుతుందని, కోస్తాంధ్ర తీరం వెంబడి గాలుల వేగం, సముద్రంలో అలల తీవ్రత తగ్గుతుందన్నారు. ప్రస్తుతం చెన్నైకి 250, నెల్లూరుకు 350 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతోందని, ఇది ఈరోజు రాత్రి నెల్లూరు-చెన్నై మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పలు చోట్ల అతిభారీ వర్షాలు, తెలంగాణలో జల్లులు, ఉత్తర కోస్తాలో మోస్తరుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.