** తాజా వార్తలు : 11న కలెక్టరేట్ల ముట్టడి: టీఆర్‌ఎస్‌వీ ** తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు దారుణం: ఎర్రన్నాయుడు, ముఖ్యనగరాల్లో కాంగ్రెస్‌ పార్టీ 125వ వార్షికోత్సవ కార్యక్రమాలు ** బోడోలాండ్‌ తీవ్రవాదుల కాల్పులు: 12 మంది మృతి ** బలహీనపడి... కర్ణాటకకు తరలిన జల్‌ తుపాను ** గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే సూపర్‌పవర్‌ కల నెరవేరదు: జేపీ ** విశాఖపట్నం: ఉద్యోగం రాలేదని మునగపాకకు చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు** విశాఖపట్నం: జిల్లాలో వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.4500 చొప్పున పరిహారం ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టరు శ్యామలరావు చెప్పారు**
Loading...

విశాఖపట్నం: అంతర్జాతీయ జ్యోతిష్య సదస్సుకు నగరం వేదిక కానుంది. అక్టోబరు 1 నుంచి నాలుగురోజులపాటు దేశ విదేశాలకు చెందిన జ్యోతిష్య శాస్త్రజ్ఞులతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ అతిథి గృహంలో సదస్సులు జరుగుతాయని సమన్వయకర్త వై.సుదర్శనరావు తెలిపారు. బుధవారం ఉదయం టైకూన్‌ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సద్గురు శివానందమూర్తి సారథ్యంలో కళాభారతి ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రోశయ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఆరుగురు విదేశీ జ్యోతిష్యశాస్త్ర పండితులు, 19మంది స్వదేశీ పండితులు సదస్సులకు హాజరవుతారన్నారు. 'వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు 2012 యుగాంతానికి నాందిగా భావించవచ్చా? నక్షత్ర, గ్రహ మండలాల్లో మార్పులు నిజమేనా? తదితర అంశాలపై చర్చిస్తారు. భవిష్యత్తు అంశాలపై రూపొందించిన పుస్తకాలను విడుదల చేస్తారు. విలేకర్ల సమావేశంలో జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు జేమ్స్‌ కెల్హర్‌(అమెరికా), ఆర్‌.రాఘవేంద్రన్‌, వై.సుదర్శనరావు, ఎన్‌.రాధాకుమారి, కె.బసవరాజు, జి.ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.